Monday, December 23, 2024

కథ ప్రధానంగా సాగే చిత్రం..

- Advertisement -
- Advertisement -

జిఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై తేజ మర్ని దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మాణంలో పూర్తిగా కథ ప్రధానంగా సాగే చిత్రం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ సినిమాకు బన్నీ వాసుతో పాటు విద్య మాధురి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Shivani Rajasekhar and Rahul Vijay movie begin

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News