Monday, December 23, 2024

చిత్రాలు గీయడంలో ఏకలవ్యుడు..

- Advertisement -
- Advertisement -

పెంట్లవెల్లి ః ఎవరితోనూ శిక్షణ తీసుకోకుండా తనకు తానే గురువుగా మారి ఏకలవ్యుడిగా నిలిచి పలు చిత్రాలను గీసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు గిరిజన యువకుడు శివరాం నాయక్. శివరాం నాయక్ ప్రస్తుతం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని పశు సంవర్ధక శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుంచి పుస్తకాలలో బొమ్మలను, స్నేహితుల చిత్రాలను గీసి ఉపాధ్యాయులతో మంచి పేరు తెచ్చుకోవడమే కాక అదే ఉపాధ్యాయుల ప్రొత్సాహంతో ముందుకు సాగడం జరిగింది. చిన్నతనం నుంచి ప్రముఖ పెయింట్ ఆర్టిస్ట్, మాజీ పార్లమెంటరి మెంబర్ ఎంఎఫ్ హుస్సేన్‌ను తనకు ఆదర్శంగా నిలుపుకుని వారిలాగా జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని శివరాం నాయక్ ఆకాంక్ష.

గురువు లేకుండా స్వయం కృషితో చిత్రాలను వేస్తూ పలువురు అధికారులతో శభాష్ అనిపించుకున్నాడు. శివరాం నాయక్ వేసిన చిత్రాలలో రామకృష్ణ పరమహంస, శ్రీ కృష్ణ, సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్, హీరో పవన్ కళ్యాణ్ లాంటి ప్రముఖుల పెయింటింగ్ వేసి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. చాలా మంది పెయింట్ ఆర్టిస్టులు డబ్బుల కోసం, కడుపు నింపుకోవడానికి వృత్తిగా భావించి చిత్రాలను వేస్తే శివరాం నాయక్ మాత్రం ఎదుటివారి ఆనందం కోసం చిత్రాలను వేస్తుంటాడు. స్నేహితుల పెళ్లి రోజు, పుట్టినరోజులకు చిత్రాలను గీసి బహుమతులుగా ఇస్తుంటాడు. తాను వేసిన చిత్రాలను సామాజిక మాధ్యమాలలో అప్‌లోడ్ చేసి చూపరులను ఆకట్టుకుంటున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News