Thursday, November 21, 2024

కొమురవెల్లి మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

శివరాత్రి సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు

కొమురవెల్లి : తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి పురస్కరించుకొని భక్తులు స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి బారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసి పోయింది. గంగరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లికి ఓడి బియ్యం పోసి డప్పు చప్పుళ్లతో భక్తులు బోనాలు చేసి అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

శివరాత్రి సందర్భంగా పెద్ద పట్నం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి రోజున మల్లన్న ఆలయంలో పెద్ద పట్నం ఘనంగా నిర్వహిస్తారు. 46 వరుసలతో పంచ రంగులతో పసుపు, కుంకుమ, తెల్ల పిండి , పచ్చ సునేరుతో ఓగ్గు పూజారులు పట్నాన్ని వేస్తారు. ఈ పట్నాన్ని శివసత్తులు మల్లన్న భక్తులు పట్నాన్ని తొక్కి వాళ్ల భక్తిని చాటుకుంటారు.

సీపీ శ్వేత అదేశాల మేరకు బారీ బందోబస్తు
శివరాత్రి సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ , భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిసిపి అడ్మిన్ మహేందర్ ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఏసీపీ సతీష్ కొమురవెల్లి ఎస్‌ఐ చంద్రమోహన్ యాదవ్ , హరి బందోబస్తు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News