Saturday, December 21, 2024

శివనగర్ ప్రజల రుణం తీర్చుకుంటా

- Advertisement -
- Advertisement -
  • వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
  • రూ. 2.83 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖిలా వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శివనగర్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం శివనగర్ వందన స్కూల్ దగ్గర కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి ఆధ్వర్యంలో సీఎంఏ నిధుల నుంచి రూ. 2.83 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుపెన్నడూ చూడని విధంగా శివనగర్ అభివృద్ధి చేశామని ముంపు నివారణ చర్యలో భాగంగా రూ. 43 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించామని, నేడు రూ. 2.83 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.

శివనగర్‌కు తాను ఎప్పుడు పెద్ద పీట వేస్తానని, శివనగర్ ప్రజలకు రుణపడి ఉన్నాని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో దిడ్డి కుమారస్వామి, డివిజన్ అధ్యక్షుడు పగడాల సతీష్, అభినాష్, ఇందిర, మహేందర్, ప్రభాకర్, సాంబయ్య, అక్షిత్, విజయ, విద్యాసాగర్, సోమలక్ష్మి, ఉమ, అశోక్‌రెడ్డి, తిరుపతి, రవి చందర్, శివలింగ, కృష్ణ, నరేందర్, సంధ్య, జనార్దన్, మంజుల, భాగ్యలక్ష్మి, నవ్య తదితరులు పాల్గొన్నారు.

33వ డివిజన్‌ను గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. అభివృద్ధి శంకుస్థాపన పనుల్లో భాగంగా శాంతినగర్, సాకరాశికుంట, పోచమ్మ దేవాలయాన్ని దర్శించుకుని పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి పోచమ్మ దేవాలయ సమీపంలో కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్ ఆధ్వర్యంలో రూ. 2.83 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

కాగా బీఆర్‌ఎస్ 33వ డివిజన్ అధ్యక్షుడు మిరిపెల్లి వినయ్ జన్మదినం సందర్భంగా వేడుకలకు ఎమ్మెల్యే హాజరై కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ ముష్కమల్ల అరుణ సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు వినయ్, వడ్డె కోటేశ్వర, రాముల బిక్షపతి, పాశికంటి రాజు, సురేష్, రాజు, శ్యామ్, సతీష్, రాజేష్, చరణ్, యూత్ అధ్యక్షుడు ధర్మేంద్ర, వీరన్న, శ్రీను, సతీష్, రమేశ్, శ్రవణ్, కుమార్, రమేశ్, ప్రతాప్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News