అఖిలేష్‌కు బాబాయ్ శివ్‌పాల్ సవాల్
లక్నో: అధికార బిజెపితో అంగకాగేవారు పార్టీలో మిగలబోరంటూ సమాజ్‌వాది పార్టీ(ఎస్‌పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన తాజా హెచ్చరికపై ఆయన బాబాయ్, ఎస్‌పి ఎమ్మెల్యే శివ్‌పాల్ సింగ్ యాదవ్ మండిపడ్డారు. దమ్ముంటే తనను ఎస్‌పి శాసనసభా పక్షం నుంచి బహిష్కరించాలని ఆయన అఖిలేష్‌కు సవాలు విసిరారు. సోషలిస్టు నాయకుడైన శివ్‌పాల్ సొంతగా ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ(లోహియా)ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఇటీవల జరిగిన యుపి అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే..ఎన్నికలు జరిగిన తర్వాత జరిగిన ఎస్‌పి ఎమ్మెల్యేల సమావేశానికి ఆయనకు ఆహ్వానం అందచేలుద.
దీంతో..ఆయన బిజెపిలో చేరనున్నట్లు సూచనలు అందచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ బిజెపిలో చేరికపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సమయం వచ్చినపుడు ఆ విషయం చెబుతానని శివ్‌పాల్ చెప్పారు. బుధవారం అఖిలేష్ చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన అభ్యంతరం చెబుతూ ఇవి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని అన్నారు. ఎస్‌పి టిక్కెట్‌పై పోటీ చేసి తాను గెలిచానని, ఒకవేళ నిర్ణయం తీసుకోదలిస్తే వెంటనే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని ఆయన సవాలు చేశారు.