Monday, January 20, 2025

యాదవుల అభ్యున్నతి కోసం శివపాల్ యాదవ్ కొత్త సంస్థ

- Advertisement -
- Advertisement -

Shivpal Yadav Announces formation of New Outfit

లక్నో: యాదవ్ సమాజ అభ్యున్నతి కోసం యదుకుల పునరుజ్జీవ మిషన్ పేరిట ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రగతిశీల్ సమాజ్‌వాది పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివపాల్ యాదవ్ గురువారం ప్రకటించారు. తమ మిషన్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలమో వ్యతిరేకమో కాదని శివపాల్ తెలిపారు. ఈ సంస్థకు శివపాల్ ప్యాట్రన్(పోషకుడు) కాగా అధ్యక్షుడిగా మాజీ ఎంపి డిపి యాదవ్ నియమితులయ్యారు. రచయిత విశ్వాత్మ ఈ సంస్థకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటారు. సమాజ్‌వాది పార్టీకి వ్యతిరేకంగా ఈ సంస్థను ఏర్పాటు చేశారా అన్న విలేకరుల ప్రశ్నకు తాము ఏ రాజకీయ పార్టీకి అనుకూలము లేదా వ్యతిరేకము కాదని శివపాల్ స్పష్టం చేశారు. యాదవ కులాన్ని ఏకం చేయడమే తమ లక్షమని ఆయన తెలిపారు. యాదవ్, కుర్మి, లోఢి తదితర వెనుకబడిన కులాల సామాజిక అభ్యున్నతి కోసం తమ సంస్థ పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ప్రారంభమై ఈ మిషన్ బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, తమిళనాడుతోసహా అనేక రాష్ట్రాలకు విస్తరిస్తుందని ఆయన వెల్లడించారు.

Shivpal Yadav Announces formation of New Outfit

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News