- Advertisement -
న్యూఢిల్లీ: రైతుల నిరసనలు, దేశ రాజధాని ఢిల్లీకి పెద్ద ఎత్తున రైతుల సమీకరణ జరుగుతున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజ్యసభలో అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్ పి) అంశంపై అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన హామీ ఇచ్చారు.
“రైతుల అన్ని ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని మీ ద్వారా సభకు హామీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇది మోడీ ప్రభుత్వం, మోడీ హామీని నెరవేర్చే హామీ’’ అని చౌహాన్ సభలో తెలిపారు.
- Advertisement -