Monday, December 23, 2024

హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన శివరాజ్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కావేరి జలవివాదం నేపథ్యంలో కర్నాటకలో ప్రజలు ఆందోళనలు ఉధృతం చేశారు. ఇదే సందర్భంలో హీరోగా సిద్ధార్థ్ నటించిన చిన్నా సినిమా విడుదల కావడంతో సిద్ధార్థ్ మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతుండగా కొందరు నిరసనకారులు అక్కడికి చేరుకొని ప్రెస్‌మీట్ ఆపేయాలని సిద్ధార్థ్ ను హెచ్చరించారు. దీంతో సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కన్నడ ప్రజల తరపున క్షమాపణ చెప్పారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కన్నడ చిత్ర పరిశ్రమ తరపున క్షమించాలని సిద్ధార్థ్‌ను కోరారు. సిద్ధార్థ్‌ను ఇబ్బంది పెట్టిన వారు ఎవరో తనకు తెలియదని ఈ ఘటన తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం చేయవద్దని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. మనోబావాలతో ఆడుకోవద్దని సూచించారు.

Also Read: కాంగ్రెస్‌లో మైనంపల్లి ముసలం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News