- Advertisement -
మధ్యప్రదేశ్ మాజీ సిఎం చౌహాన్
భోపాల్ : తన గురించి తాను అడగటం లేదా పైరవీకి దిగడం కన్నా చావడం మేలని మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలుగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆయన సారథ్యంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి తిరిగి గెలిచింది. అయితే ఆయనకు కాకుండా ఈ పదవికి ఉజ్జయని ఎమ్మెల్యే మోహన్ యాదవ్‌ను బిజెపి అధినాయకత్వం ఎంపిక చేసింది. మంగళవారం వీడ్కోలు సభలో చౌహాన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
పై వారి నిర్ణయాన్ని పాటిస్తానని, తనకోసం ఎప్పుడూ అడగలేదని, ఇది తన పద్ధతి కాదని, ప్రాధేయపడటం కన్నా చావడం మేలనుకుంటానని ఆయన స్పందించారు. కొత్త సిఎంకు తన నుంచి అన్ని విధాలుగా సహకారం సలహాలు ఉంటాయని తెలిపారు. తన నిష్క్రమణంపై రోదిస్తున్న మహిళా కార్యకర్తలను ఆయన ఓదార్చారు.
- Advertisement -