Monday, December 23, 2024

రైలులో ప్రయాణించిన కేంద్ర మంత్రి చౌహాన్

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఢిల్లీ నుంచి భోపాల్‌కు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తన సతీమణితో కలిసి ప్రయాణించారు. నిరాడంబర నేతగా ప్రజల్లో గుర్తింపు పొందిన ఆయనను చూడగానే ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. ప్రధాని మోడీ మార్గదర్శకత్వంలో మంత్రి అశ్విని వైష్ణవ్ కృషితో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆ శాఖ నిరంతరం శ్రమిస్తోందని అభివర్ణించారు. మంత్రి తన రైలు ప్రయాణ అనుభవాలను , ఆ ఫోటోలను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మధ్యప్రదేశ్‌కు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిశ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News