Friday, December 27, 2024

శివరాత్రి ఎఫెక్ట్: మండుతున్న పండ్ల ధరలు 

- Advertisement -
- Advertisement -

మాహా శివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా పండ్లు, కూరగాయాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. శివరాత్రి సందర్భంగా పండ్ల మార్కెట్లకు భక్తులు పొటేత్తడంతో వ్యాపారులు ఒక్కసారి ధరలను పెంచేశారు. దీంతో పండ్ల ధరలను చూసి నగరవాసులు ఒక్కసారిగా ఆవాక్కు అయ్యారు. శివరాత్రి పర్వదినం రోజున శివుడికి ఉపవాస దీక్షలు పాటించే భక్తులందరు సాయంత్రం వేళ్లల్లో పండ్లతోనే దీక్షను విరమిస్తారు. దాదాపు ఎప్పుడో గాని పండ్ల ముఖం కూడా చూడని నిరుపేదలు సైతం పండుగ పూట పండ్లను కొంటారు.

దీంతో వ్యాపారులు దీనిని అసరాగా చేసుకుని అన్ని పండ్ల ధరలను ఏకంగా రెండితల నుంచి ఐదింతలకు వరకు పెంచారు. ప్రధానంగా ఆపిల్, కమలం, అరటి, పుచ్చకాయ, అంగూర్, కర్జూరపండ్ల ధరలు అమాంతగా పెంచారు. మరోవైపు కూరగాయాల ధరలు సైతం భారీగా పెరిగాయి. శివరాత్రి జాగరం తర్వాత రోజున శివుడికి అన్ని కూరగాయాలతో వంటలు చేసిన నైవేధ్యంలో సమర్పిస్తారు. దీంతో భక్తులు అన్ని రకాల కూరగాయలు కొనడం అనివార్యం కావడంతో వ్యాపారులు ఇష్టరీతిన ధరలు పెంచి అమ్మకాలు కొనసాగించారు. పండుగ వేళా కావడంతో చేసేది లేక స్తోమత మేరకు కొనుక్కొని ఇంటికి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News