Monday, January 6, 2025

భారత్‌కు వెళ్లి.. వారి సొంత గడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ వేదికగా జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాము పాకిస్థాన్ కు వెళ్లమని, తమకు సంబంధించిన మ్యాచ్ లను హైబ్రిడ్ పద్దతిలో యూఏఈ, దుబాయ్ లల్లో నిర్వహించాలని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పింది. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం హైబ్రిడ్ పద్దతికి ఒప్పుకోవడంలేదు. భారత్ ఖచ్చితంగా పాకిస్థాన్ లోనే మ్యాచ్ లను ఆడాలని పట్టబట్టింది. దీంతో హైబ్రిడ్ పద్దతికి అంగీకరించాలని.. లేకపోతే ట్రోఫీని ఇతర దేశాలకు తరలించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ క్రమంలో పాకిస్థాన్..ఐసీసీకి కొన్ని కండీషన్స్ పెట్టింది. హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించాలంటే.. భారత్‌లో నిర్వహించే ఐసీసీ టోర్నీలను కూడా హైబ్రిడ్‌ మోడల్‌లో నిర్వహించాలని పాక్ మెలిక పెట్టింది. వాళ్లు మా దేశం రానప్పుడు.. మేం కూడా భారత్ కు వెళ్లమని పీసీబీ పేర్కొంది. అయితే, పాక్‌ ప్రతిపాదనను ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ వ్యతిరేకించారు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ లో మాట్లాడుతూ.. భవిష్యత్‌లో భారత్‌కు పాకిస్థాన్‌ వెళ్లాలని.. వారిని సొంతగడ్డపైనే ఓడించి రావాలని పీసీబీకి సూచించాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీపై త్వరలోనే ఐసీసీ ప్రకటన చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News