హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓటమి చెందడంతో సెమీస్ వెళ్లకుండానే ఇంటికి దారి పట్టింది. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు, ప్రజలు ఆ దేశపు జట్టుపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలో క్రికెట్ జట్లన్నీ ఆరుగురు బౌలర్లతో ఆడుతున్నారని పాక్ మాత్రం ఐదుగురిని ఎందుకు ఎంపిక చేయలేదని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డారు. బౌలర్లకు బదులుగా ఇద్దరు ఆల్ రౌండర్లతో ఆడటం సరైన నిర్ణయం కాదని, మెదడు లేని వాదని అని చురకలంటించారు. ఈ విషయంలో ఆటగాళ్లను నిందించలేమని, జట్టు మేనేజ్ మెంట్ బుర్ర తక్కువ పని చేసిందని ఎద్దేవా చేశారు.
పాక్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ చేశాడని, కోహ్లీకి హ్యాట్సఫ్ అని కితాబిచ్చాడు. వన్డే ఫార్మాట్ లో ఎదురులేని మొనగాడు కోహ్లీ అని షోయబ్ అక్తర్ ప్రశంసించారు. అతడు నిజాయతీ కలిగిన బ్యాట్స్ మెన్ కావడంతోనే 14000 మైలు రాయిని అధిగమించాడని, వంద సెంచరీలు చేయాలని ఆకాంక్షించాడు. భారత బ్యాట్స్ మెన్లు విరాట్, రోహిత్, గిల్ మాదిరిగా పాక్ బ్యాట్స్ మెన్లలో నైపుణ్యాలు లేవని షోయబ్ అక్తర్ ఎద్దేవా చేశారు. ఎటువంటి ప్లాన్ లేకుండానే పాక్ బరిలోకి దిగిందని ధ్వజమెత్తారు. పాక్ ఓడిపోతుందని ముందే తెలుసు కావునా ఈ ఓటమి తనని నిరాశకు గురి చేయలేదన్నాడు.