Tuesday, December 3, 2024

పిసిబిపై అక్తర్ ఫైర్

- Advertisement -
- Advertisement -

shoaib akhtar slams pcb for Pak school level cricket

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)పై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. కీలకమైన న్యూజిలాండ్ సిరీస్‌కు అనామక జట్టును పంపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రదర్శన గల్లీ స్థాయి క్రికెట్ కంటే అధ్వాన్నంగా ఉందని అక్తర్ విమర్శించాడు. రెండు టెస్టుల్లోనూ ఆతిథ్య న్యూజిలాండ్ అద్భుతంగా రాణించిందన్నాడు. అయితే పాకిస్థాన్ మాత్రం తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో ఘోరంగా విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు ఎంపికలో పిసిబి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదన్నాడు. భారత క్రికెట్ బోర్డును చూసైనా పిసిబి పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లితో సహా కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకున్నా ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్టును భారత్ చిత్తుగా ఓడించిన విషయాన్ని అక్తర్ గుర్తు చేశాడు. కివీస్, దక్షిణాఫ్రికా వంటి జట్లు అద్భుత ఆటను కనబరుస్తుండగా పాకిస్థాన్ ఆట రోజురోజుకు తీసికట్టుగా మారడంపై అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటికైన పాకిస్థాన్ బోర్డు జట్టును పటిష్టపరచడంపై దృష్టి పెట్టాలని సూచించాడు.

shoaib akhtar slams pcb for Pak school level cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News