Saturday, November 23, 2024

టివి షో నుంచి  బయటికొచ్చేసిన క్రికెటర్ షోయబ్ అఖ్తర్ 

- Advertisement -
- Advertisement -

Shoiab

దుబాయ్: ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్‌లో మంగళవారం న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ టివి షో నుంచి అవమాన భారంతో బయటికి వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళితే… పిటివి నిరహించిన లైవ్ షోలో క్రికెట్ విశ్లేషకుడిగా పాకిస్థాన్ పేసర్ షోయబ్ పాల్గొన్నాడు. ఆ షో హోస్ట్, అయిన నోమాన్ నియాజ్ ప్రసిద్ధ క్రికెట్ చరిత్రకారుడు, విశ్లేషకుడు. షోయబ్ కూడా 46 టెస్ట్‌లు, 163 అంతర్జాతీయ వన్‌డేలు ఆడిన అనుభవస్తుడు. ఆయనకి, షోయబ్ అఖ్తర్‌కు మధ్య షోలో వాదప్రతివాదాలు చోటుచేసుకున్నాయి.

హోస్ట్ అడిగిన ప్రశ్నకు షోయబ్ అఖ్తర్ జవాబు ఇవ్వకుండా పేసర్ హారీస్ రౌఫ్ గురించి, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంఛైజ్ లాహోర్ ఖలందర్స్, హారీస్‌ను ప్రోత్సహించిన దాని కోచ్ ఆఖిబ్ గురించి పొగుడుతూ మాట్లాడేసరికి వారి మధ్య సమస్య మొదలైంది. నోమాన్ అతడిని అడ్డుకునే ప్రయత్నం చేసినా అలాగే మాట్లాడుతుండేసరికి హోస్ట్ కాస్త చిర్రెతి పోయి మీరు షో నుంచి నిష్క్రమించండి అన్నాడు. దాంతో షోయబ్ తగిలించుకున్న మైక్రోఫోన్‌ను తీసేసి బయటికి వచ్చాడు. అంతేకాక తన క్రికెట్ విశ్లేషకుడి పదవికి రాజీనామా కూడా చేశాడు. నోమాన్ అతడిని తిరిగి వెనక్కి పిలిచే ప్రయత్నం చేయలేదు. అదే షోలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజాలు వివియన్ రిచర్డ్, డేవిడ్ గ్రోవర్‌లకు ఇదంతా అదోలా అనిపించింది. లైవ్‌లో చూస్తున్న చాలా మంది దీనికి నిస్తేజులయ్యారు. వారిద్దరూ తర్వాత ట్విట్టర్ ద్వారా తమ వాదన వివరించుకునే ప్రయత్నం చేశారు.

https://youtu.be/ftuBTzcpBuI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News