Wednesday, January 22, 2025

విడిపోయిన షోయబ్, సానియా మీర్జా జంట.. మరో పెళ్లి చేసుకున్న పాక్ క్రికెటర్

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన నటి, మోడల్ సనా  జావేద్ ను షోయబ్ పెళ్లి చేసుకున్నారు. ఈమేరకు షోయబ్ తమ పెళ్లి ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గతంలో భారత టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జాను షోయబ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. సనా జావేద్ కూడా షోయబ్ తో తన వివాహం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

కొంతకాలంగా షోయబ్, సానియా విడివిడిగా ఉంటున్నారన్న వార్తలు వచ్చాయి. ఇద్దరూ కొంతకాలం దుబాయ్ లో కాపురం పెట్టారు. అప్పుడే ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలిసింది. రెండేళ్లుగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News