Monday, December 23, 2024

మళ్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్

- Advertisement -
- Advertisement -

సనా జావేద్.. హైదరాబాద్ అమ్మాయే!

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సనా జావేద్ గురించి నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సనా తల్లిదండ్రులది హైదరాబాదే కావడం విశేషం. అయితే వారు చాలా ఏళ్ల క్రితమే సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు. సనా జెడ్డాలో 1993 జూన్ 6న  జన్మించింది. జెడ్డాలోని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంది. తర్వాత సనా కుటుంబం కరాచీకి మారింది. కరాచీ యూనివర్శిటీలో సనా తన చదువు కొనసాగించింది.

మొదట్లో కోకోకోలా, మోబిలింక్ టెలివిజన్ కమర్షియల్స్ లో నటించి మోడల్ గా మంచి పేరు తెచ్చుకుంది. తర్వాత 2012లో టీవీ సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టింది. మేరా పెహ్లా ప్యార్, షెహ్రెయే జాత్ అనే సీరియళ్లలో చిన్న చిన్న పాత్రలు ధరించిన సనా, హమ్ టీవీలో ప్రసారమైన జరా యాద్ కరే అనే సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది.

2020 అక్టోబర్ లో సనా గాయకుడు ఉమర్ జస్వాల్ ను వివాహం చేసుకుంది. అయితే వీరిద్దరూ 2023లో విడిపోయారు. ఆ తర్వాత ఆమె షోయబ్ మాలిక్ తో ప్రేమలో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News