Thursday, December 26, 2024

నిన్ను ప్రేమించట్లేదంటూ సానియా మీర్జాకి చెప్పిన షోయబ్ మాలిక్! (వీడియో)

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాల పన్నెండేళ్ల వైవాహిక బంధానికి ఇటీవల తెరపడిన సంగతి తెలిసిందే. సనా జావేద్ అనే నటిని వివాహమాడి, పెళ్లి ఫోటోలను షోయబ్ ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో వీరి వివాహ బంధం తెగిపోయిందని తెలిసింది. ఈ విషయాన్ని సానియా మీర్జా కుటుంబం కూడా ధ్రువీకరిచింది.

ఇక అప్పటినుంచి అభిమానులు షోయబ్, సానియాలకు సంబంధించిన పాత వీడియోలను నెట్ లో వెతికి తిరిగి రీపోస్ట్ చేస్తున్నారు. అలా తవ్వకాల్లో బయటపడిన ఒక వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. అది షోయబ్, సానియా కలసి చేసిన రీల్. అందులో షోయబ్ సానియాతో ‘మై తుమే ప్యార్ నహీ కర్తా’ (నేను నిన్ను ప్రేమించడం లేదు)  అంటాడు. దానికి బదులుగా సానియా బాలీవుడ్ హిట్ సాంగ్ ‘ఇస్మే తేరా ఘాటా మేరా కుఛ్ నహీ జాతా’ (నీకే నష్టం.. నాకు పోయేదేం లేదు) అంటూ కొంటెగా పాడుతుంది. ఇది వాళ్లిద్దరి కాపురం సజావుగా సాగుతున్న సమయంలో చేసిన వీడియో అని అర్థమవుతూనే ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News