Friday, December 20, 2024

మేము కలిసేందుకు సమయం దొరకడంలేదు: షోయబ్ మాలిక్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: ఇద్దరు కలిసి గడిపేందుకు సమయం దొరకడం లేదని సానియా మీర్జా భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ తెలిపాడు. షోయబ్ మాలిక- సానియా మీర్జా విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ మాట్లాడాడు. ఇద్దరం ప్రొఫెషనల్ లైఫ్‌లో ఉండడంతో కలవడం కుదరడం లేదని పేర్కొన్నారు. సమయం దొరికితే చాలు ఇద్దరు కలిసి విదేశాలకు వెళ్తున్నామని చెప్పాడు. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ ఆట కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపాడు. ఐసిసికి పెద్ద మ్యాచ్ ఏది అంటే పాకిస్థాన్‌తో భారత్ తలపడడమేనని చెప్పాడు. ఇరు జట్లు మైదానంలోకి దిగాయంటే చాలు పాకిస్థాన్-భారత్‌లో ఉన్న పౌరులే కాదు వివిధ దేశాలలో కూడా అభిమానులు ఆతృతంగా ఎదురు చూస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News