Monday, January 20, 2025

అందాల నటుడి కాంస్య విగ్రహ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నడిబొడ్డున్న డాబాగార్డెన్స్ కూడలిలో ప్రముఖ సినీ నటుడు శోభన్‌బాబు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. శోభన్ అభిమానులు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దు ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా జె రామాంజనేయులు అనే అభిమాని విగ్రహం ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశం వ్యాప్తంగా శోభన్ బాబు అభిమానుల ఉన్నారని, నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారని ప్రశంసించారు. ఆరు అడుగుల అందగాడిగా, కుటుంబ చిత్రాలు తీసి ప్రేక్షకులను అలరించారు. శోభన్ బాబు సినిమాలు సమాజానికి ఎంతో సందేశం ఇచ్చాయని రామాంజనేయులు చెప్పారు. అప్పటి తరంలో ఇప్పటి తరం యువ నటులకు కూడా శోభన్ బాబు ఆదర్శనీయం అని కొనియాడారు.

భౌతికంగా ఆయన లేకపోయిన సినిమాల ద్వారా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మెచ్చుకున్నారు. ఆయన పేరిట అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయని రామాంజనేయులు ప్రశంసించారు. విగ్రహ స్థల దాత ఎ సతీష్ కుమార్, విగ్రహ దాత జె రామాంజనేయులు, అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి అధ్యక్షులు మాజీ ఎంఎల్‌సి సుధాకర్ బాబు, అఖిల భారత్ శోభన్ బాబ సేవా సమితి సభ్యులు పూడి శ్రీనివాస్, టి వీర ప్రసాద్, భట్టి ప్రోలు శ్రీనివాసరావు, ఎస్ ఎన్ రావు, సాయి కామ రాజు తదితరలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News