- Advertisement -
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ రామమందిరం నుంచి శనివారం ఉదయం11:30కు శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర కొనసాగనుంది. 17 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 12 కి.మీ.కి పైగా వీర హనుమాన్ విజయయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర కొనసాగే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ తాడ్‌బండ్ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
- Advertisement -