Monday, December 23, 2024

సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సీతారాంబాగ్​లోని రామాలయం నుంచి శోభాయాత్ర గురువారం ప్రారంభమైంది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. సూమారు 7 కిలోమీటర్లు మేర శోభాయాత్ర సాగనుంది. సీతారంబాగ్ ఆలయం- బోయగూడ కమాన్ నుంచి దూల్ పేట, జుమేరాత్ బజార్, గౌలిగూడ కమాన్ మీదుగా కోఠి ఆంధ్రబ్యాంక్, హనుమాన్ వ్యాయామశాలకు శోభాయాత్ర చేరుకుంటుంది. శోభాయాత్రకు పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు. శోభాయాత్ర మార్గంలో సిసిటివి కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రి 8 గంటలకు శోభాయాత్ర ముగియనుందని పోలీసులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News