Monday, December 23, 2024

మెదక్‌లో కాంగ్రెస్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రాజీనామా

డబ్బు సంచులు ఉంటేనే విలువుందని ఆరోపణ

మనతెలంగాణ/హైదరాబాద్ : మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి రాజీనామా చేశారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నా గుర్తింపు లేదని ఆయన మనస్థాపం చెందారు. డబ్బులు ఉంటేనే టికెట్లు ఇస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. కాంగ్రెస్ వ్యతిరేకులకే సీట్లు ఇస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారి ని విస్మరిస్తున్నారని ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తిరుపతి రెడ్డి ప్రకటించారు. మైనంపల్లి రోహిత్‌కు మెదక్ టిక్కెట్ కేటాయించడంతో అసంతృప్తికి లోనైన ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేస్తున్నట్టు పేర్కొనడంతో పాటు రాజీనామా లేఖను టిపిసిసి పంపారు. పార్టీ కోసం పదేళ్ల పాటు సేవ చేస్తే మోసం చేశారని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజా బలం ఉన్న వారికి విలువ లేదని, డబ్బుల సంచులు, నో ట్ల కట్టలకే విలువ ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుమారు పదేళ్లు గా కష్టపడి పనిచేసిన తనలాంటి వారికి స్థానం లేదని ఆయ న ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థం అవుతుందని, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిని గుర్తించకుండా, కేవలం డబ్బు సంచులే ప్రాతిపదికగా టిక్కెట్టు ఇస్తున్న వైనం బాధ కలిగిస్తుందన్నారు. పార్టీ పటిష్టత కోసం శాయుశక్తుల కృషిచేసి పోలీసు కేసులు కూడా ఎదుర్కొన్నానని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

జీవితాంతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు పార్టీ నాయకత్వ బాధ్యతలు అప్పగించి పార్టీని బందీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాంటి వారి చేతుల్లో పార్టీకి మనుగడ ఉండదని, పార్టీకి భవిష్యత్ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల కట్టలకు అమ్ముకునే వారు రేపు రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడి బాజరులో నవ్వుల పాలు చేయడం ఖాయమన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని నాలాంటి వారు పార్టీ కోసం పనిచేస్తే వారు పూర్తిగా మోసపోయినట్టేనని, డబ్బులు ఉన్న వారి చేతుల్లో పార్టీని తాకట్టు పెట్టేస్తున్నారని ఆయన ఆరోపించారు. నికార్సయిన నేతలు కా కుండా డబ్బులు ఇచ్చిన వారికి టిక్కెట్టు ఇవ్వడం వల్ల పార్టీకే నష్టమని ఈ విషయంలో సోనియా, రాహుల్ గాంధీ సైతం మౌనంగా ఉండడం బాధ కలిగించిందన్నారు. అన్ని విధాలుగా పార్టీయే ప్రాణంగా పని చేసిన తనకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ డిసిసి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తనకు మెదక్ సీటు ఇవ్వరని గమనించిన తిరుపతిరెడ్డి ఆ పార్టీని వీడుతూ రాజీనామా ప్రకటించడం గమనార్హం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News