Thursday, December 19, 2024

పిఠాపురంలో పవన కల్యాణ్ కు షాక్?

- Advertisement -
- Advertisement -

పిఠాపురంనుంచి పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్ కు ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంనుంచి  జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన శేష కుమారి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె జనసేన నియోజకవర్గం ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆమె అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వయంగా పోటీకి దిగడంతో శేషకుమారి అసంతృప్తికి లోనయ్యారు. ఇదే అదనుగా వైసీపీ ఆమెకు గాలం వేసింది.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంనుంచి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు 14 వేల మెజారిటీతో గెలిచారు. ఆయనకు 83 వేల ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి వర్మకు 68వేల ఓట్లు, జనసేన అభ్యర్థి శేషకుమారికి 28 వేల ఓట్లు వచ్చాయి. ఈసారి టిడిపి, జనసేన మధ్య పొత్తు కుదరడంతో పవన్ కల్యాణ్ గెలుపు ఖాయమని భావిస్తున్న తరుణంలో శేష కుమారి తీసుకున్న నిర్ణయం జనసేనకు షాక్ అనే చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News