Monday, January 20, 2025

సింగరేణి ఎన్నికల్లో టిబిజికెఎస్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

పదవులకు రాజీనామా చేసిన యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు

మన తెలంగాణ / హైదరాబాద్: ఈ నెల 27న జరగనున్న సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిర్ణయం తీసుకోవడంతో ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిబిజికెఎస్) అధ్యక్ష, కార్యదర్శలు వెంకటరావు , మిర్యాల రాజారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కెంగర్ల మల్లయ్యలు తమ పదవులకు గురువారం రాజీనామా చేశారు. మీరు తీసుకున్న నిర్ణయంతో కార్మికులకు , కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఒక లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కాలం తమకు సహకరించినందుకు వారు కృతజతలు తెలుపుతూ వెంటనే తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ సందర్భంగా వారు కవితకు విజ్ఞప్తి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News