- Advertisement -
హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) వసతి గదులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సామాన్య, మధ్యతరగతి భక్తులకు అందుబాటులో ఉండే నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వంటి వసతి గృహాల అద్దెను రూ.500 నుంచి ఏకంగా వెయ్యి రూపాయలకు పెంచింది.
నారాయణగిరి రెస్ట్ హౌస్‌లోని 1,2,3 గదులను రూ.150 నుంచి జిఎస్టీతో కలిపి రూ.1700 పెంచారు. రెస్ట్‌హౌస్ 4లో ఒక్కో గదికి ప్రస్తుతం రూ.750 వసూలు చేస్తుండగా ఇప్పుడు ఏకంగా రూ.1700 వసూలు చేస్తున్నారు. మరోవైపు కార్నర్ సూట్‌ను జిఎస్టీతో కలిపి రూ.2,200 చేశారు. స్పెషల్ టైపు కాటేజీల్లో గది అద్దెను రూ. 750 నుంచి రూ.2,800లకు పెంచారు.
- Advertisement -