Friday, December 20, 2024

ట్విట్టరు యుజర్లకు మస్క్ షాక్

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో : ట్విట్టర్ వినియోగంపై ఎలన్ మస్క్ పరిమితులు విధించారు. ట్వీట్లు , పోస్టుల రీడింగ్‌లను తక్కువ సంఖ్యలో చేయాల్సి ఉంటుందని నిర్ణయించారు. అత్యధిక యుజర్లు ప్రతిరోజూ చూసే వీక్షకులపై ఆంక్షలను సముచిత రీతిలో తీసుకున్న చర్యలుగా మస్క్ తెలిపారు. తమ సామాజిక మాధ్యమంలో వచ్చే డేటా సమగ్రతకు , అనధికారిక చొరబాట్లను నివారించేందుకు ఈ విధంగా ట్విట్టర్‌ను మార్చినట్లు వివరించారు. ఇంతకు ముందు లాగా కాకుండా ఇకపై ప్రజలు దీనిని వీక్షించేందుకు ముందు లాగ్ ఆన్ కావల్సి ఉంటుంది. తరువాతనే ట్వీట్లు, ప్రొఫైల్స్ చూడటానికి వీలేర్పడుతుంది.

అత్యధిక సంఖ్యలో అనుచిత రీతిలో ట్వీట్ల వీక్షణకు వెళ్లడం వల్ల సాధారణ యుజర్లకు వారి సేవలకు ఇబ్బంది ఏర్పడుతున్నందున ముందుగా ఈ గందరగోళం నివారణకు ఈ ఆంక్షలను ప్రస్తుతానికి విధిస్తున్నట్లు మస్క్ తెలిపారు. తనకు రెగ్యులర్ యుజర్ల నుంచి ఇటీవల అందిన ఫిర్యాదుల క్రమంలోనే ఈ చర్యలకు దిగినట్లు వివరించారు. ఖాతాదార్లను వర్గీకరిస్తున్నట్లు వెరిఫైడ్, అన్ వెరిఫైడ్, కొత్తగా వచ్చే అన్‌వెరిఫైడ్ ఖాతాదార్లను గుర్తించి వారి వాడకాలపై వేర్వేరుగా ఆంక్షలు ఖరారు చేశారు. శనివారం ఒకేసారి లక్షలాదిగా అన్‌వెరిఫైడ్ వీక్షకులు పోస్టింగ్‌లు చూడటంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలా గంటల పాటు ట్విట్టర్ సేవలు నిలిచిపొయ్యాయి. దీనితో గందరగోళం ఏర్పడింది. దీనిని ఇక ముందు చవిచూడకుండా చేసేందుకు చర్యలు చేపట్టారు.

దీని మేరకు ఇక వెరిఫైడ్ అకౌంట్స్ వారు 6వేల పోస్టులు, అన్ వెరిఫైడ్ అకౌంట్‌కు 600 పోస్టులు, కొత్త అన్ వెరిఫైడ్ ఖాతాలకు 300 వరకూ పోస్టులు వీక్షించే అవకాశం కల్పించారు. యూజర్లు ఉచితానుచితాలు మరిచి ట్విట్టర్‌కు బానిస కావడం మంచి పరిణామం కాదని, ఈ సామాజిక బాధ్యతను తాను తన సామాజిక వేదిక ద్వారా కూడా పాటిస్తూ ఇప్పుడు ఈ ఆంక్షలను వెలుగులోకి తీసుకువచ్చినట్లు, విపరీతి స్థాయిలో పోస్టింగ్‌లు , పదేపదే అనధికారిక వీక్షణలతో తలెత్తే సాంకేతిక సమస్యలకు ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News