అనర్హత వేటు వేసిన సుప్రీం కోర్టు కమిటీ
సుప్రీంకోర్టు కమిటీ కీలక నిర్ణయం
హెచ్‌సిఎ ఎన్నికల్లో పోటీకి నో ఛాన్స్
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) ఎన్నికలకు ముందు మహ్మద్ అజారుద్దీన్‌కు షాక్ తగిలింది. ఆయన హెచ్‌సిఎ ఎన్నికల్లో పోటీ చేయకుండా సుప్రీంకోర్ట్ ని యమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది. గతంలో హెచ్‌సిఎ అధ్యక్షుడిగా వుంటూనే డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగానూ అజార్ వ్యవహరించారు. ఇది నిబంధనలు ఉల్లంఘించడమేనని పే ర్కొన్న కమిటీ.. చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు హెచ్‌సిఎ ఓటర్ల జాబితా నుంచి అజారుద్దీన్ పేరును కూడా తొలగించింది. ఇకపోతే అక్టోబర్ 20 నుంచి హెచ్‌సిఎ ఎన్నికలు జరగనున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఇసి మెంబర్స్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి 173 మంది తో కూడిన ఓటర్ల జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అక్టోబర్ 7 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నా రు. అక్టోబర్ 14న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 16 వర కు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.