Thursday, January 23, 2025

కాంగ్రెస్ పార్టీకి షాక్

- Advertisement -
- Advertisement -

సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి
ధరణి తీసేస్తే రైతుబంధు ఎలా జమవుతుంది..?
ధరణి తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశాం
దీని ద్వారా యజమానులు మాత్రమే భూమిని ఇతరులకు మార్చగలరు

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయరంగం అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ తెచ్చి భూములను డిజిటలైజేషన్ చేశామని.. తద్వారా యజమానులు మాత్రమే భూమి ఇతరులకు మార్చగలరని వివరించారు. ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఇందులో ఎలాంటి అవకతవకలు జరగవని వివరించారు. తెలంగాణలో భూములు విలువ భారీగా పెరిగాయని.. రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. ధరణి ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుందని.. దీనిని తీస్తే రైతుబంధు నిధులు ఎలా జమ అవ్వాలని కెసిఆర్ ప్రశ్నించారు. భువనగిరి డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సిఎం కెసిఆర్ అనిల్‌కుమార్‌రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల పుణ్యమా భూములు విలువ భారీగా పెరిగాయని సిఎం కెసిఆర్ వివరించారు. రూ.80 వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పు ఎప్పుడో తీరిందని సిఎం తెలిపారు.
ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ బిఆర్‌ఎస్
బిఆర్‌ఎస్ ఒక లక్ష్యంతో ఏర్పాటైన పార్టీ అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని నిలబడ్డామని.. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు విద్యుత్ లేక పొలాలు ఎండిపోయేవని కెసిఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు 3 గంటల విద్యుత్ అంటే రైతులు తిట్టుకుంటున్నారని చెప్పారు. 24 గంటలు కరెంట్ ఇస్తే ఎవరికి అవసరమైనప్పుడు వారు వాడుకుంటారని వివరించారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని సిఎం తెలిపారు.
బిఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేతలు
భువనగి యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల వెంకటేశ్ యాదవ్, వలిగొండ ఎంపిపి నూతి రమేశ్ ముదిరాజ్, వలిగొండ సర్పంచ్ బోల్ల లిలతా శ్రీనివాస్, వలిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వలిగొండ కాంగ్రేస్ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య, భువనగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లెంల జంగయ్య యాదవ్, వర్కింగ్ ప్రసిడెంట్ ఎంపిటిసి పాశం శివానంద్, మైనారిటీ ప్రసిడెంట్ ఎస్కే షరీఫుద్దీన్, నమాత్ పల్లి సర్పంచ్ శాలిని, మాజీ ఎంపిపి కుంభం వెంకట్ పాపిరెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ కుంభం విద్యసాగర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వలిగొండ మండల నాయకులు బుర్రి రమేశ్ రెడ్డి, వలిగొండ మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు బాతరాజు ఉమాదేవి బాలనర్సింహ, గరిశె రవి, కాసుల వెంకటేశ్, బత్తిని సహదేవ్ గౌడ్, వార్డు మెంబర్లు ఎమ్మె శేఖర్, రాపోలు శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పల్లెర్ల మురళి, పల్లెర్ల సహదేవ్, కిరణ్ కుమార్, కొండూరు సాయిగౌడ్, ఎస్‌సి సెల్ మండలాధ్యక్షుడు పల్లెర్ల సుధాకర్, పబ్బు సురేందర్, బత్తిని లింగయ్య, మైసోల్ల లక్ష్మినర్సు సహా భువనగిరి యాదాద్రి జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌ఎలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గ్యాదరి కిశోర్ కుమార్, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నలమోతు భాస్కర్ రావు, భూపాల్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బాల్కసుమన్, జీవన్ రెడ్డి, జెడ్‌పి చైర్మన్లు ఎలిమినేటి సందీప్ రెడ్డి, బండా నరేందర్ రెడ్డి, వేం రెడ్డి నర్సింహారెడ్డి, డైరీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News