కేరళలోని కొట్టాయంలో ఐదుగురు నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు తమ జూనియర్స్‌ను ఘోరంగా ర్యాగింగ్ చేసిన ఘటన వెలుగుచూసింది. చట్టాలు ఎన్ని వచ్చినప్పటికీ ర్యాగింగ్ భూతం ఇంకా కొన్ని క్యాంపస్‌లలో కొనసాగుతూనే ఉంది. తాజాగా వెలుగు చూసిన ర్యాగింగ్ వీడియోలో సీనియర్స్ ఓ జూనియర్‌ని బెడ్ మీద పడుకోబెట్టి అతడి చేతులు, కాళ్లు మంచానికి కట్టేశారు. తరువాత ఓ కొసదేలిన కంపాస్ పరికరంతో పదేపదే గుచ్చారు. శరీరంపై అనేక గాయలయ్యాక తెల్లటి లోషన్ దానిపై రుద్దారు. అంతేకాక ఆ తెల్లటి లోషన్‌ను కంట్లో, నోట్లో కూడా పోశారు. ఒకానొక సందర్భంలో అతడి జననాంగంపై డంబెల్ పెట్టారు. అతడి నిప్పుల్స్‌కు రెండు క్లాత్ క్లిప్‌లు తగిలించి లాగారు. వీడియో మొత్తంలో ఆ బాధిత విద్యార్థి అరవడం, ఏడ్వడం కనిపించింది.
కానీ ఆ దాష్టికానికి పాల్పడిన వారు మాత్రం నవ్వుకుంటుండం వీడియోలో చూడొచ్చు. చివరికి కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్‌కు చెందిన ముగ్గురు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. 2024 నవంబర్ నుంచి దాదాపు మూడు నెలలపాటు ఈ హింస కొనసాగిందని ఆ విద్యార్థులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీనియర్స్ ప్రతి ఆదివారం జూనియర్స్‌ను బెదిరించి ఆల్కాహాల్ తెప్పించుకునేవారని, డబ్బు గుంజేవారని, దానిని వ్యతిరేకించే వారిని ర్యాగింగ్ పేరిట హింసించే వారని తెలిసింది. ఓ విద్యార్థి తట్టుకోలేక ఈ విషయాలు తన తండ్రికి చెప్పగా, ఆయన పోలీస్ ఫిర్యాదు చేయమని ప్రోత్సాహించడంతో విషయం వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో నిందితులైన విద్యార్థులు శామ్యూయెల్ జాన్సన్(20), రాహుల్ రాజ్(22), జీవా(18),