Monday, December 23, 2024

మొక్కలు నాటిన షూటర్ ఈషా సింగ్

- Advertisement -
- Advertisement -

Shooter Esha Singh is who planted plants

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జిహెచ్‌ఎంసి పార్క్‌లో షూటర్ ఈషా సింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఈషా సింగ్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 17 కోట్లకు పైగా మొక్కలు నాటడం చాల గొప్ప విషయమన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణం లభించాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గగన్ నారంగ్, క్రీడా శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానీయ, షాట్స్ సుజాత ముగ్గురికి ఈషా సింగ్ ఛాలెంజ్ విసిరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News