Wednesday, January 22, 2025

బ్యాంకాక్ షాపింగ్ మాల్ వద్ద కాల్పులు… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

బ్యాంకాక్ : థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో మంగళవారం మధ్యాహ్నం మేజర్ షాపింగ్‌మాల్ వద్ద ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు గాయపడ్డారు. సియాం పారాగన్ మాల్‌లో ఈ సంఘటన జరిగింది. కాల్పులు తరువాత నిందితుడిని అదుపు లోకి తీసుకున్నామని, పరిస్థితి అదుపు లోనే ఉందని పోలీస్ అధికార ప్రతినిధి అర్చయోన్ క్రయిథాంగ్ విలేఖరులకు వెల్లడించారు. 2022 అక్టోబర్ 6న రూరల్ డే కేర్ సెంటర్ వద్ద తుపాకీ, కత్తుల దాడిలో 36 మంది హత్యకు గురైన సంఘటనకు స్మారక దినం పాటించాలని తాయ్ ప్రజలు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో ఈ కాల్పులు జరగడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News