Sunday, December 22, 2024

ఫ్లోరిడాలో కాల్పులు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

ఫ్లోరిడా ( అమెరికా ): క్రిస్మస్‌కు ముందు ఫ్లోరిడా లోని ఓ మాల్‌లో కాల్పులకు ఒకరు మృతి చెందగా, ఓ మహిళ గాయపడింది. ఫ్లోరిడా లోని ఓకాలా మాల్‌లో కాల్పుల ఘటన జరిగిందని ఓకాలా పోలీస్ చీఫ్ మైక్ బాల్కెన్ తెలిపారు. ప్యాడాక్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో అనేక రౌండ్ల కాల్పులు జరిగాయని, ఆ తర్వాత పోలీస్‌లకు సమాచారం వచ్చిందని చెప్పారు. తుపాకీ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయారని మరో మహిళ కాలికి తూటా గాయమైందని పోలీస్‌లు పేర్కొన్నారు. ఈ దాడి తరువాత నిందితుడు అక్కడ నుంచి కాలినడకన తప్పించుకున్నాడని చెప్పారు. క్రిస్మస్ పండగ సందర్భంగా మాక్ కొనుగోలుదార్లతో రద్దీగా ఉంది. కాల్పుల తరువాత మాల్‌నుంచి జనం వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News