Wednesday, January 22, 2025

మహిళను కాల్చిచంపిన పోలీస్‌లు

- Advertisement -
- Advertisement -

హూస్టన్ : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లోని హూస్టన్‌లో మెగా చర్చిలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్‌లు ఆమెను కాల్చి చంపారు. నిందితురాలు ఆదివారం మధ్యాహ్నం ఐదేళ్ల బాలుడితో లాక్‌వుడ్ చర్చి లోకి ప్రవేశించింది. తాను ధరించిన ట్రెంచ్‌కోట్‌లో నుంచి పొడవాటి తుపాకీని తీసి , ప్రార్థనలు చేస్తున్నవారిపై ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించింది. దీంతో అక్కడ ఉన్నవారు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న భద్రతా పోలీస్‌లు ఎదురు కాల్పులు జరపడంతో ఆ మహిళ మృతి చెందింది. ఆమె తీసుకు వచ్చిన బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ కాల్పుల్లో 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన బాలుడు పిల్లల ఆస్పత్రిలో ఉన్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని హూస్టన్ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ చెప్పారు. గాయపడిన మరోవ్యక్తి వేరే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆ మహిళ కాల్పులు ఎందుకు జరిపిందో దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆమెతో వచ్చిన బాలుడికి ఆమెతో ఏ సంబంధం ఉందో ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగితే మరోలా ఉండేదని చర్చి పాస్టర్ ఓస్టీన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News