టోక్యో : జపాన్‌లో ఓ వ్యక్తి కత్తితో, రైఫిల్‌తో జరిపిన దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పోలీసు అధికారులు , ఓ మహిళ ఉన్నారు. సెంట్రల్ జపాన్‌లోని నాగానోలో దాడికి పాల్పడ్డ దుండగుడు భవనంలో దాక్కున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తి దాడికి పాల్పడ్డ వ్యక్తి ముందుగా అటుగా వెళ్లుతున్న ఓ మహిళ వెంటపడి తరిమినట్లు వెల్లడైంది. కిందపడ్డ ఆమెపై కత్తితో గాయపర్చాడు.
తరువాత అటుగా వచ్చిన పోలీసులపై కాల్పులు జరిపాడు . ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళ ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమెను ఏదో కారణంతో చంపివేయాలని ఈ వ్యక్తి భావించినట్లు, ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాధమికంగా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దాడికి దిగగిన వ్యక్తి సైనిక దుస్తులు వేసుకుని , మాస్క్, కళ్లకు సన్‌గ్లాసుతో ఉన్నాడు. ఇప్పటివరకూ ఈ నిందితుడు దొరకకపోవడం, భవనంలో దాగి ఉండటంతో ఇతరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వెలువడ్డాయి.