Saturday, April 12, 2025

వాషింగ్టన్‌లో కాల్పుల కలకలం: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌లో కాల్పులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. అనకోస్టియాలో గుడ్‌హోప్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో ముగ్గురు దుర్మరణం చెందగా నలుగురు గాయపడ్డారని స్థానిక పోలీస్ అధికారి పమేలా స్మిత్ వెల్లడించారు. మృతులలో ఒక మహిళ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పర్యాటకులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కాల్పలు జరిపి వాళ్లను భయబ్రాంతులకు గురి చేశాడని వెల్లడించారు. 2023 నుంచి ఇప్పటి వరకు కాల్పుల్లో 150 మంది పైగా చనిపోయారు. రెండు దశాబ్ధాల తరువాత తక్కువ సమయంలో ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలి సారని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ఒక్క ఆగస్టు నెలలో కాల్పుల్లో 12 మందికి పైగా చనిపోయారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News