Wednesday, January 22, 2025

యుఎస్‌లో మళ్లీ కాల్పుల కలకలం

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్, డెట్రాయిట్‌లలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. డెట్రాయిట్ శివార్లలో జరిగిన కాల్పుల్లో క్షతగాత్రుల్లో ఎనిమిది సంవత్సరాల బాలుని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. టెక్సాస్ పార్క్‌లో శనివారం జూన్‌టీన్త్ వేడుకలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు, పలువరు గాయపడినట్లు అధికారులు తెలియజేశారు. ఆస్టిన్‌కు ఉత్తరంగా దాదాపు 19 మైళ్ల (30.5 కిమీ) దూరంలోని రౌండ్ రాక్‌లో ఓల్డ్ సెట్లర్స్ పార్క్‌లో జూన్‌టీన్త్

వేడుక సమయంల శనివారం రాత్రి 11 గంటలకు కొన్ణి క్షణాల ముందు కాల్పులు జరిగాయి. ఒక కచేరి సమయంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరగగా, ఎవరో కాల్పులు ప్రారంభించినట్లు రౌండ్ రాక్ పోలీస్ చీఫ్ అలెన్ బ్యాంక్స్ ఆ ప్రదేశంలో విలేకరుల గోష్ఠిలో చెప్పారు. ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు ఆ వాగ్వాదంలో ప్రమేయం లేదని అలెన్ తెలిపారు. కచేరి కోసం ఏర్పాటు చేసిన వేదికకు కొంత దూరంలోని ఒక విక్రేత ప్రాంతం సమీపంలో కాల్పులు జరిగాయని అలెన్ చెప్పారు. ఆ కార్యక్రమానికి హాజరవుతున్న పోలీస్ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.

డెట్రాయిట్ శివారులో కాల్పులు : 9 మందికి గాయాలు
డెట్రాయిట్ శివారులో వేసవి తాపం నుంచి రక్షణ కోసం కుటుంబాలు సమీకృతమైన ఒక నీటి పార్క్ వద్ద ఒక దుండగీడు కాల్పులు ప్రారంభించిన తరువాత ఇద్దరు పిల్లలు, వారి తల్లితో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీస్ బృందంఅనుమానితుని ఒక ఇంటి వద్ద గమనించినట్లు, అక్కడ అతను తనను తాను కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. 8 ఏళ్ల బాలుని తలపై కాల్చారని, శనివారం రాత్రి అతని పరిస్థితి విషమంగా ఉందని ఓక్లాండ్ కౌంటీ షెరీఫ్ మైక్ బౌచర్డ్ విలేకరుల గోష్ఠిలో వెల్లడించారు. పొత్తికడుపులోను, కాలిపైన గాయాలు తగిలిన తరువాత బాలుని తల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉంది.

అతని నాలుగు సంవత్సరాల సోదరుడు కాలి గాయంతో ఒకింత క్షేమంగానే ఉన్నాడు. రోచెస్టర్ హిల్స్‌లో కాల్పుల సంఘటనలో 10 మందికి తూటా గాయాలు తగిలాయని తాము భావిస్తున్నట్లు అధికారులు తొలుత చెప్పారు. కాని ఆ ప్రాంతం ఆసుపత్రులను సంప్రదించిన తరువాత క్షతగాత్రుల సంఖ్యను సవరించారు. 30, అంతకు ఎక్కువ వయస్సు ఉన్న తక్కినవారి పరిస్థితి సంతృప్తికరంగా ఉందని బౌచర్డ్ తెలిపారు. ఒక సిటీ పార్క్‌లోని రిక్రియేషన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 5 తరువాత ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు బౌచర్డ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News