- Advertisement -
లాస్‌ఏంజెల్స్: కాలిఫోర్నియాకు చెందిన మాంటెరీ పార్క్‌లో శనివారం కాల్పులు జరిగాయని, పలువురు చనిపోయారని పోలీసులు తెలిపినట్లు ‘లాస్‌ఏంజెల్స్ టైమ్స్’ పేర్కొంది. మాంటెరీ పార్క్‌లో చైనీయుల చాంద్రమాన సంవత్సరాది జరుగుతున్నప్పుడు రాత్రి 10 గంటలకు ఈ కాల్పుల ఘటన జరిగినట్లు ఆ వార్తా పత్రిక పేర్కొంది. ఆ సంవత్సరాది వేడుకలకు వేలాది జనం వచ్చారని సమాచారం. లాస్ ఏంజెల్స్ నగరానికి 7 మైళ్లు(11 కిమీ.) దూరంలో మాంటెరీ పార్క్ ఉంది.
- Advertisement -