Monday, January 20, 2025

లాస్ ఏంజెలెస్‌లో కాల్పులు: ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

Shooting in Los Angeles: Two dead

లాస్ ఏంజెలెస్(అమెరికా): లాస్ ఏంజెలెస్‌లో కారు షో జరుగుతున్న పార్కులో ఆదివారం కాల్పులు సంభవించి ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు. శాన్ పెడ్రోలోని పెక్ పార్కులో సాయంత్రం 3.50 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు లాస్ ఏంజెలెస్ పోలీసులు తెలిపారు. పార్కులోని బేస్‌బాల్ డైమండ్ వద్ద కాల్పుల శబ్దాలు వినిపించాయని, ఈ కాల్పులకు ఎవరు పాల్పడ్డారో తెలియరాలేదని లాస్‌ఏంజెలెస్ పోలీసు డిపార్ట్‌మెంట్ కెప్టెన్ కెల్లీ మునీజ్ తెలిపారు. మృతులు, బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదని ఆయన చెప్పారు. కాల్పులు జరిపింది ఎంతమంది, వారు ఎవరు వంటి వివరాలేవీ ఇంకా తెలియలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News