Monday, December 23, 2024

నార్వేలో కాల్పుల కలకలం: ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

Shooting in Norway: Two killed

ఆస్లో(నార్వే): నార్వే రాజధాని ఆస్లోలో ఎల్‌జిబిటిక్యు(స్వలింగ సంపర్కులు) సమాజం అధికంగా వచ్చే ఒక బార్ వెలుపల ఒక వ్యక్తి శనివారం తెల్లవారుజామున జరిపిన కాల్పులలో ఇద్దరు వ్యక్తులు మరణించగా 12 మందికి పైగా గాయపడ్డారు. 1979లో ప్రారంభమైన లండన్ పబ్ గే బార్‌గా ప్రసిద్ధి పొందింది. ఒక బ్యాగుతో వచ్చిన వ్యక్తి అందులో నుంచి గన్ బయటకు తీసి విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఎన్‌ఆర్‌కె టివి జర్నలిస్టు అలవ్ రోనీబర్గ్ తెలిపారు. ఏటా ఘనంగా నిర్వహించే ఆస్లో ప్రైడ్ పరేడ్ కోసం నగరం సిద్ధమవుతున్న వేళ ఈ సంఘటన జరగడంతో పోలీసు అధికారుల ఆదేశం మేరకు అన్ని ప్రైడ్ పరేడ్‌లను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ కాల్పులలో సంబంధించి ఒక నిందితుడిని పోలీసుల అరెస్టు చేశారు. గాయపడిన వారిలో 14 మందికి వైద్య చికిత్స అందచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులకు కారణాలేమిటో తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News