Monday, December 23, 2024

ఫ్లోరిడాలో ట్రంప్‌కు సమీపంలో కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడి డోనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పులు జరిగాయి. ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్ గోల్ఫ్ కోర్టులో కాల్పులు జరిగాయి. ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా తుపాకీలో ఓ వ్యక్తి సంచరించినట్టు గుర్తించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కాల్పులు జరిపారు. పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నామని సర్వీస్ అధికారులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి ఎకె 47 తుపాకీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించామని సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. కాల్పులు ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు. ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని కమలా హారిష్ తెలిపారు. అమెరికాలో హింసకు తావులేదని కమలా హారిస్ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News