- Advertisement -
ఇండియానాపోలిస్ లోని షాపింగ్ మాల్ బయట శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరంతా 12 నుంచి 17 ఏళ్ల లోపు వారే. రాత్రి 11.30 తరువాత సర్కిల్ సెంటర్ మాల్ సమీపాన కాల్పులు వినిపించగానే పోలీస్ బృందాలు ఆ ప్రాంతంలో గస్తీ ప్రారంభించాయి. గాయపడిన ఈ యువకులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని ఇండియానాపోలిస్ మెట్రో పాలిటన్ పోలీస్ డిప్యూటీ చీఫ్ టాన్యా టెర్రీ చెప్పారు. కొంతమంది యువకుల్లో తలెత్తిన ఘర్షణే కాల్పులకు దారి తీసిందని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎవర్నీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు.
- Advertisement -