Sunday, January 5, 2025

న్యూయార్క్ క్వీన్స్‌లోని అమాజురా నైట్‌క్లబ్ బయట కాల్పులు

- Advertisement -
- Advertisement -

క్వీన్స్ ప్రాంతంలోని అమాజురా నైట్ క్లబ్ వెలుపల నూతన సంవత్సర వేడుకలు చూడ్డానికి గుమిగూడిన జనం మీద గుర్తు తెలియని దుండగులు 30 సార్లు కాల్పులు జరిపారు. దాంతో 10 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ముగ్గురు లేక నలుగురు దుండగులు ఆ ప్రాంతానికి వెళ్లి జనుల మీద 30 సార్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారంతా 16 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు వారే. నూతన సంవత్సర వేడుకలు చూడడానికి నైట్ క్లబ్ బయట వారు నిలుచుండగా వారిపై ఈ కాల్పులు జరిగాయని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ గురువారం పత్రికా విలేకరుల సమావేశంలో వెల్లడించింది. కాల్పుల్లో గాయాలైన వారికి ప్రాణాపాయం ఏమి లేదని, వారంతా చికిత్స తర్వాత కోలుకుంటారని కూడా పోలీసులు స్పష్టం చేశారు. అయితే దాడిచేసిన వారు ఉగ్రవాదులు కాదని, వారుపయోగించిన సెడాన్ వాహనం కోసం గాలిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News