Monday, December 23, 2024

సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్‌లు షురూ

- Advertisement -
- Advertisement -

Shooting will start from September 1

సెప్టెంబర్ 1 నుంచి సినిమా షూటింగ్‌లు జరుపుకునే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. అత్యవసరమైతే ఈనెల 25 నుంచి ఛాంబర్ అనుమతితో షూటింగ్‌లు చేసుకోవచ్చని పేర్కొంది. ఈనెల 1 నుంచి సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన విషయం తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “చిత్ర పరిశ్రమలోని సమస్యలపై 23 రోజులుగా వివిధ శాఖల వారితో చర్చలు జరుపుతున్నాము. చివరికి సెప్టెంబర్ 1 నుంచి షూటింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము. ఇక ఈ నెల 30న తుది నిర్ణయాలు వెల్లడిస్తాం. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లకు వీపీఎఫ్ సమస్య కూడా పరిష్కారమైంది. వచ్చే నెల రెండో తేదీ నుంచి వీఫీఎఫ్ ఛార్జీలు వసూలు చేయడం లేదు. టికెట్ ధరలు, తినుబండారాలు అందుబాటు ధరల్లో ఉంటాయి. పెద్ద సినిమాలకు ఒక శ్లాబ్ ప్రకారం టికెట్ ధరలుంటాయి. నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు ఎగ్జిబిటర్లకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా భవిష్యత్తులో మంచి ఫలితం ఉంటుంది” అని అన్నారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ “గత 23 రోజులుగా దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు 24 శాఖల వారితో చర్చలు జరిపి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇంకా కొన్ని సమస్యలపై చర్చలు జరిపి పరిష్కరిస్తాము. ఏదైనా ఛాంబర్ నిర్ణయమే ఫైనల్‌” అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News