Saturday, December 21, 2024

ఇండియానా నైట్‌క్లబ్‌లో కాల్పులు: ఇద్దరు మృతి , నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Indiana Club shootout
గ్యారీ (అమెరికా): ఇండియానా నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. చికాగోకు ఆగ్నేయంగా ఉన్న గ్యారీలో తెల్లవారుజామున 2 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు వచ్చిన నివేదికలపై స్పందించిన అధికారులు, కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను కనుగొన్నామన్నారు.  ప్లేయోస్ నైట్‌క్లబ్ ప్రవేశ ద్వారం దగ్గర 34 ఏళ్ల వ్యక్తి,  లోపల 26 ఏళ్ల మహిళ పడి ఉండడం కనిపించిందని పోలీసులు తెలిపారు. స్థానిక ఆసుపత్రికి తరలించగా ఆ ఇద్దరూ చనిపోయినట్లు నిర్ధారించారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారని, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కాల్పులకు దారితీసిన పరిస్థితి, బాధితుల పేర్లను అధికారులు వెల్లడించలేదు. పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించాల్సి  ఉన్నందున,  పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నందున అనేక చట్ట సంస్థలు స్పందించాయని వారు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News