Tuesday, January 28, 2025

ఏడుగురు దొంగలు తుపాకులతో కాల్పులు… ధైర్యంగా ఎదుర్కొన్న ఎస్ఐ

- Advertisement -
- Advertisement -

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో ఏడుగురు దొంగలు జ్యువెలరీ షాపును లూటీ చేయడానికి వచ్చారు. అప్పుడు ఎస్ఐ గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఏడుగురు దుండగులు సదరు ఎస్ఐపై కాల్పులు జరిపిన కూడా దైర్య సాహసాలతో వారిని ఎదుర్కొన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పశ్చిమ బెంగల్ లో – రాణిగంజ్‌లో ఓ జ్యువెలరీ షాపులో చోరీకి చేయడానికి ఏడుగురు దొంగలు చొరపడ్డారు. అయితే అదే సమయంలో వ్యక్తిగత పని నిమిత్తం అటువైపు వచ్చిన ఎస్ఐ మేఘనాథ్ మోండల్ షాపులోకి దొంగలు చొరబడ్డారని గమనించాడు. రూ.4 కోట్ల విలువైన సొమ్మును కాజేసి బయటకొచ్చిన దొంగలపై ఎస్ఐ మేఘనాథ్ కాల్పులు జరిపాడు. అతడి దెబ్బకి బెదిరిపోయిన దొంగలు సగం సొమ్ము అక్కడే వదిలేసి పారిపోయారు. ఎస్ఐ కాల్పులు జరిపినప్పుడు ఓ దొంగ కడుపులో బుల్లెట్ దిగడంతో కింద పడిపోయాడు. వెంటనే గాయపడిన దొంగను మరో మరో ఇద్దరు దుండగులు బైక్ పై తీసుకెళ్లారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News