Monday, December 23, 2024

బస్సుపై కాల్పులు… బుల్లెట్ దిగినా 30 కిలో మీటర్లు బస్సు నడిపాడు…

- Advertisement -
- Advertisement -

ముంబయి: మినీ బస్సుపై మంగళవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు కాల్పులు జరపడంతో డ్రైవర్ చేతికి బుల్లెట్ దిగినా కూడా 30 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 35 మంది యాత్రికులు అమరావతిలో ఆలయాన్ని దర్శించుకొని నాగ్‌పూర్ వెళ్తున్నారు. సవేద్ గ్రామంలో జాతీయ రహదారిపై డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే  బస్సును నడిపిస్తుండగా బొలెరో వాహనం వెంబడించింది. ముందు వెళ్తారేమోనని ఆ వాహనానికి బస్సు డ్రైవర్ రెండు సార్లు దారి ఇచ్చారు. బస్సు ముందుకు వెళ్లిన తరువాత తుపాకీతో అతడిపై బొలెరో నుంచి దుండగులు కాల్పులు జరిపారు. తొలిసారి తప్పించుకున్నప్పటికి రెండో సారి తన చేతిపై కాల్చారని తెలిపారు. చేతి నుంచి రక్తం కారుతున్న 30 కిలో మీటర్లు బస్సును నడిపి పోలీస్ స్టేషన్ ఎదుట ఆపాడు. డ్రైవర్ చూపిన ధైర్యసాహసాలకు దోపిడీ దొంగల నుంచి బయటపడ్డామని యాత్రికులు తెలిపారు. బొలెరో వాహనంపై యుపి నంబర్ ఉందని డ్రైవర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News