- Advertisement -
న్యూఢిల్లీ : సింగపూర్‌కు చెందిన ఇ-కామర్స్, గేమింగ్ సంస్థ సీ లిమిటెడ్ (సీలిమిటెడ్) భారతదేశంలో తన వ్యాపారాన్ని మూసివేస్తోంది. మార్చి 29 నుండి భారతదేశంలో రిటైల్ వ్యాపారం నుండి తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నామని కంపెనీ సోమవారం తెలిపింది. కంపెనీ ఇటీవల దేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. అయితే కంపెనీ నష్టాల్లో కూరుకుపోయి వ్యాపారం చేయడం కష్టతరంగా మారుతోంది. కంపెనీ ఫ్రాన్స్‌తో వ్యాపారాన్ని కూడా మూసివేయనుంది. ప్రసిద్ధ గేమింగ్ యాప్ ‘ఫ్రీ ఫైర్’ను భారతదేశం నిషేధించింది. అయితే భారతదేశాన్ని విడిచిపెట్టాలనే షాపీ నిర్ణయాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) స్వాగతించింది. భారతదేశ సార్వభౌమ చట్టాన్ని ఉల్లంఘించిన, భారతదేశం నుండి సేకరించిన డేటాను ఉల్లంఘించిన ఏ కంపెనీ అయినా షాపీ లాగా భారతదేశాన్ని వదిలివేయవలసి ఉంటుందని సిఎఐటి పేర్కొంది.
- Advertisement -