- Advertisement -
హైదరాబాద్ మహానగరం రాత్రివేళ వెలవెలపోతోంది. నిన్న మొన్నటి వరకూ రాత్రి పన్నెండయినా తెరచి ఉండే దుకాణాలూ, రెస్టారెంట్లూ ఇప్పుడు పదకొండయ్యే సరికి మూసేస్తున్నారు. దాంతో రాత్రివేళ షాపింగ్ కు అలవాటుపడిన కుర్రకారుకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. రాత్రి 11 గంటలకే హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలను మూసేస్తున్నారు. మాట వినని దుకాణదారులపై పోలీసులు కేసులు పెడుతున్నారు. ఈ కారణంగా రాత్రివేళ హైదరాబాద్ నగరం బోసిపోతోంది.
- Advertisement -