Wednesday, April 2, 2025

జహీరాబాద్‌లో దోపిడీ దొంగల హల్‌చల్

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్‌ః జహీరాబాద్ పట్టణంలోని పలు వైన్‌షాపులు సహా ఐదుచోట్ల దోపిడీ దొంగలు శనివారం రాత్రి హల్‌చల్ సృష్టించారు. చెక్‌పోస్టు వద్ద గల వినాయక వైన్స్, పస్తాపూర్ జై భవాని వైన్స్, మరికొన్ని వైన్ షాపులలో చోరీ చేశారు. సుభాష్ గంజ్‌లోని గణేష్ సాయి ట్రేడర్స్‌తోపాటు ఒకేరోజు పలుచోట్ల చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి వెంటనే ఆయా ఘటనా స్థలాలకు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను వెంటనే పట్టుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News